Mahesh Emotional : నా అమ్మానాన్న మీరే.. భావోద్వేగానికి గురైన మహేష్.. వైరల్ వీడియో

Mahesh Emotional Speech in Gunturkaaram Pre Release Event
Mahesh Emotional : చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రితోటి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. భారీ బాక్సాఫీస్ సినిమాలు చేసిన వారిలో మొదటి వరుసలో నిలుస్తారు ఆయన. మాస్, క్లాస్ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటారు మహేశ్ బాబు. ఆయన ఇటీవల చేసిన సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా ఆయన జీవితంలో మరిచిపోలేని మూవీ. ఎందుకంటే దీంతో ఆయనకు అన్ని చేదు జ్ఞాపకాలే మిగిలాయి.
మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వరుసగా మహేశ్ కుటుంబంలో అశుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. 2021, మేలో ఈ మూవీ ప్రారంభించారు. 2022, జనవరి 9వ తేదీ మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు మరణించాడు. 2022, సెప్టెంబర్ 28వ తేదీ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు. ఆ తర్వాత రెండు నెలల వ్యవధిలోనే 2022, నవంబర్ 15వ తేదీ ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు.
గుంటూరు నిర్వహించిన ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాలను గుర్తుకు తెచ్చుకున్న మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. మహేష్ మాట తీరు ఆయన అభిమానులను కంటతడి పెట్టించింది. మహేష్ బాబు ఇటీవల తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన సంగతి తెలిసిందే.
సినిమా విజయం మరియు కలెక్షన్ల గురించిన అప్డేట్లను కృష్ణ ఎలా పంచుకునేవారో గుర్తు చేసుకుంటూ అతను తన తండ్రిని ప్రస్తావించాడు. మహేష్ మాట్లాడుతూ, ‘ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న.. మీరే ఇవ్వాలి ఇంకా నాన్న గారు చెప్పే అప్డేట్స్’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.గుంటూరు కారం భారతదేశంలో 12న, US ప్రీమియర్లతో 11న విడుదలవుతోంది.