YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్,కూటమి,వైసీపీ పార్టీల మధ్య పోటాపోటీగా సాగుతోంది.వైసీపీ మాత్రం ఒకవైపు చెల్లెలు షర్మిల,మరోవైపు కూటమి విసురుతున్న మాటలతో తట్టుకోలేకపోతోంది, ప్రచారంలో ఎవరిని ఎలా ఎదుర్కోవాలో అనే సందిగ్ధంలో పడింది వైసీపి పార్టీ.ఒకవేళ చెల్లెలు షర్మిలను ఎదో ఒక ఆయుధంతో ఎదుర్కొంటే ఆ ఆయుధం తిరిగి కొట్టడం జరుగుతోంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు తన అభ్యర్థులను గెలిపించుకోడానికి విస్తృత ప్రచారం చేపట్టింది.ప్రచారంలో భాగంగా ఆదోనిలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వచ్చిన ఆమె అన్న పరిపాలనపై దాడికి దిగింది.షర్మిల ఏమిమాట్లాడుతుందో అని వినడానికి వచ్చిన పలువురు వైసిపి బ్యానర్లు ఊపుతూ నిరసన తెలియజేయడానికి రావడం జరిగింది.కాంగ్రెస్ చీఫ్ ఆయిన్ షర్మిలకు సిద్ధం..సిద్ధం అనే నినాదాలు చేస్తూ వ్యతిరేక ప్రదర్శనలు చేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యాకురాలి హోదాలో షర్మిల తన అన్నను నమ్ముకున్న తమ్ముళ్లకు ఎదురు దెబ్బ తీసింది. అది ప్రైవేట్ మీడియా సంస్థల్లో విస్తృత ప్రచారం అవుతోంది.
మీరు సిద్ధం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎస్… నేను కూడా సిద్దంగానే ఉన్న.మీ జగన్ ను ముఖ్యమంత్రి కుర్చీనుంచి దించడానికి సిద్దమై వచ్చా.అందుకు అన్నిటికీ సిద్దపడే ప్రజల్లోకి వచ్చా.మీ జగనన్న దేనికి సిద్ధంగా ఉన్నాడో మీరు చెప్పగలరా..నేను చెబుతున్న… మీ ముఖ్యమంత్రి జగన్ కుర్చీ దిగిపోడానికి సిద్దమయ్యాడు.కాషాయం పార్టీ నాయకులకు సేవ చేయడానికి సిద్దమయ్యాడు.మరోసారి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధమైతే… అయన రాకను అడ్డుకోడానికే సిద్దమయ్యా. మల్లి అప్పులు చేయకుండా అడ్డుకోడానికి సిద్దమయ్యా.. అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఇచ్చిన సిద్ధం కు సిద్ధం డోస్ తో జగన్ తమ్ములు ఇంటిముఖం పట్టక తప్పలేదు.
షర్మిల మాత్రం ఎక్కడికి వెళ్లిన తన ప్రచారంలో వైఎస్ జగన్ నే లక్ష్యముగా చేసుకొని ప్రచారం చేయడం విశేషం. అన్న,చెల్లెలు మధ్య రాజకీయ పోరు చూసిన ప్రజలకు వారి మాటలు ఆసక్తిగా ఉంటున్నాయి.సొంత పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర చేసి చివరకు కాంగ్రెస్ లో చేరి ఆంధ్ర ప్రదేశ్ కు పార్టీ అధ్యక్షురాలుగా నియామకం అయ్యారు.ఎన్నికలు రావడంతో అన్ననే ఓడించి తన సత్తా చాటుకోడానికి చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలించనుందో వేచిచూడక తప్పదు.