Sri Reddy : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బాగానే మార్పులు వచ్చాయని చూస్తూనే అర్థం అవుతుంది. ఒకప్పుడు ట్యాలెంట్ తోనే ఎక్కువగా అవకాశాలు అందుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంత ట్యాలెంట్ ఉన్నా.. ఎంత అందం ఉన్నా సరే చాలామంది భామలకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురవుతూనే ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు.
ఇలాంటి వాటితోనే మీటూ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం స్టార్ట్ అయిన కొత్తలో బాగా వినిపించిన పేరు శ్రీరెడ్డి. ఒకప్పుడు తాను కూడా కాస్టింగ్ కు గురయ్యానంటూ ఎన్నో సార్లు కామెంట్లు చేసింది ఈ బ్యూటీ. అంతే కాకుండా ఎంతో మంది అగ్ర హీరోల మీద ఆమె చేసిన ఆరోపణలతో చివరకు ఇండస్ట్రీకి దూరం అయ్యే పరిస్థితులు వచ్చాయి ఆమెకు.
అయితే ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇప్పటికీ అలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపేలా ఉన్నాయంటున్నారు. ఆమె మాట్లాడుతూ.. కొందరు ఇండస్ట్రీలో అవకాశాల కోసం నన్ను వాడుకున్నారు. నాకు కూడా అవకాశాలు వస్తాయనే ఆశలు ఉండేవి.
అందుకే కొన్ని అవకాశాల కోసం నేను కాంప్రమైజ్ అయ్యాను. చాలా మందితో పడకున్నాను. అందులో ఎలాంటి తప్పు లేదని నాకు తెలుసు. ఎందుకంటే నన్ను మోసం చేసిన వారిదే తప్పు గానీ.. నాది ఎలాంటి తప్పు లేదు అందులో. కేవలం నన్ను వాడుకున్న వారిదే తప్పు అంటూ చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఆమె చేసిన కామెంట్లపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ వస్తున్నారు.