RSS Survey : ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో మే 13న ఎన్నికల ఘట్టం ముగిసింది. మరి కొద్ధి గంటల్లో ఫలితాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. విజయం ధీమాలో ఉన్న అభ్యర్థులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ ఏర్పడింది. గెలుపు కోసం నువ్వా ? నేనా ? అంటూ పోటీపడ్డాయి. కూటమి మాత్రం విజయంపై ధీమాలో ఉంది. అత్తెసరు మెజార్టీ సాధించి అయినా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆశలో వైసీపీ ఉంది. కూటమి తోపాటు వైసీపీ పై పలు సంస్థలు సర్వే చేయించాయి. ఆ సర్వేలో కూడా కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ సంఘ్ పరివార్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఒక పెద్ద నమ్మలేని నిజాన్ని వెల్లడించింది. సంఘ్ పరివార్ ఏపీ ఎన్నికల్లో ఎవరు అధికారం లోకి వస్తుందని ఓటర్ల నాడీ పై సర్వే చేయించారంట. ఆ సర్వేలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని సంఘ్ పరివార్ స్పష్టంచేసింది. ఏయే పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధింస్తుందోననే విషయాన్నీ సైతం గణాంకాల ద్వారా పరివార్ వెల్లడించింది. ఇది తెలిసిన ఓటర్లు ఈ సర్వే ఎంతవరకు నిజమనే చర్చ రాజకీయ వర్గాల్లో ,మొదలైనది.
RSS లెటర్ ప్యాడ్ పై పార్టీలు సాధించే గణాంకాలు నమోదయి ఉన్నాయి. తెలంగాణ ప్రాంత సంఘ్ సంచాలక్ బర్ల సురేందర్ రెడ్డి సంతకంతో వివరాలు ఉండటం విశేషం.
సంఘ్ పరివార్ పేరుతో వైసీపీ అధికారంలోకి వస్తుందనే సర్వే నివేదిక ఎంతవరకు నిజం అనే విషయంపై కొందరు అరా తీశారు. సంఘ్ పరివార్ సొంత వెబ్సైట్ లో పలువురు రాజకీయ నిపుణులు వెదికారు. అందులో ఎన్నికల ఫలితాలు, కానీ పోలింగ్ నమోదు కు సంబందించిన విషయాలు కానీ ఎక్కడ లేవు. RSS సోషల్ మీడియాలో కూడా అంటువంటి సమాచారం లేదు.
ఈ విషయంపై సంఘ్ పరివార్ స్పందించింది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వే సంఘ్ పరివార్ చేయలేదు. ఆ ప్రకటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. సంతకం కూడా తప్పుడు సంతకమే. రాజకీయ సర్వే లు RSS ఎప్పుడు చేపట్టలేదు. చెప్పట్టదు కూడా అని సంఘ్ పరివార్ స్పష్టం చేసింది.