JAISW News Telugu

YCP Social Media : మళ్లీ గాసిప్స్ తో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ సోషల్ మీడియా..!!

YCP Social Media

YCP Social Media

YCP Social Media : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా అబద్దాల ఫ్యాక్టరీ అని మరోసారి నిరూపితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోతుందని చాలా సర్వేలు చెప్తున్నా.. లేదు తాము గెలుస్తామని అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని సర్వేలు, ఇంటలీజెంట్ రిపోర్టులు అందిన తర్వాత కూడా కేసీఆర్ తామే తెలుస్తామని అన్నారు. అప్పుడు ఓటమి కేసీఆర్ వంతయితే ఇప్పుడు జగన్ వంతు అయ్యేలా కనిపిస్తుంది.

వైసీపీ విజయం సాధిస్తుందని, జూన్ 9వ తేదీ విశాఖపట్నంలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని అందుకు ప్రముఖుల కోసం హోటళ్లలో గదులన్నీ అప్పుడే బుక్ అయ్యాయంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తోంది. అయితే విశాఖలోని హోటళ్ల యజమానులను ఆరా తీయగా అలాంటిది ఏమీ లేదని చెప్తున్నారు. ఇదంతా వైసీపీ సోషల్ మీడియా సృష్టే అని తేటతెల్లమైంది.

ఆ తేదీన బుక్ చేసుకోవాలంటే బ్లాక్ లో చేసుకోవాల్సిందే అంటూ వైసీపీ సోషల్ మీడియా గ్లోబల్స్ ప్రచారం చేసింది. కానీ ఆ రోజు కేవలం ఫోన్ లో బుక్ చేసుకోవచ్చు.. అంటే అంత కాలీగా ఉన్నాయన్నమాట. పైగా వందల సంఖ్యలో రూములు ఉన్నాయన్నమాట. అయితే బుకింగ్ ను పెంచాలని హోటళ్ల యజమానులు తీసుకువచ్చిన స్కీమ్స్ కూడా ఆ తేదీ తర్వాత రోజులకు కూడా ఉన్నాయి. గో అబిబో, మేక్ మై ట్రిప్ వంటి ఆన్ లైన్ యాప్ లను పరిశీలిస్తే  వైజాగ్ లో హోటల్ గదుల కోసం భారీ డిస్కౌంట్ ఉన్నట్లు కనిపిస్తుంది.

దీంతో వైసీపీ ప్రచారం అంతా ఉత్తదేనని తేలిపోయింది. అలాగే, విశాఖకు వెళ్లే బస్సులు, ట్రెయిన్లు రిజర్వేషన్లతో నిండిపోయాయని వైసీపీ సోషల్ సెల్ ఉదరగొడుతోంది. కానీ, విశాఖకు వెళ్లే బస్సులో సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నట్లు తేలింది. వీటిలో కూడా డిస్కౌంట్లు ఉండడం గమనార్హం. వైసీపీ మాత్రం విశాఖలో 9న ఏదో జరగబోతోందని.. జనంతో కిక్కిరిసిపోనుందని ప్రచారం చేస్తూ లేని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ సంతృప్తి పొందుతోంది.

Exit mobile version