YCP : చంద్రబాబు వ్యాఖ్యలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
YCP : పాణ్యం, అనకాపల్లి సభల్లో సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఈవో ముకేషక కుమార్ మీనాని వైసీపీ నేతలు కలిశారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈసీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో దుర్భాషలాడిన నేతలపై 48 గంటలు నిషేధం విధించిందని అన్నారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఓటమి భయంతో కూటమి ఆరాచకాలకు పాల్పడుతోందని అన్నారు. కూటమిని అడ్డు పెట్టుకొని టీడీపీ అధికారులను బదిలీ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జగన్ వెంటే ప్రజలు ఉన్నారని, జగన్ ను ప్రజలు పరిపాలనాధ్యక్షుడిగా చూస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు.