YCP-Social Media : అధికారం కోసం ఇంటి మీడియా ఉన్నప్పటికినీ సరిపోలేదు వైసీపీ అధినేత జగన్ కు. ఎందుకంటే చంద్రబాబు పరిపాలనపై దుమ్మెత్తి పోయడానికి మరో మీడియా అవసరం ఏర్పడింది జగన్ కు. చంద్రబాబు ప్రజలకు తీపి పంపిణి చేసినా కూడా చేదుగా చూపించడానికి మీడియా అవసరమని జగన్ గుర్తించారు. ఎట్టకేలకు ఒక సోషల్ మీడియాను ఎంచుకున్నారు. ఒకవైపు సొంత మీడియా, మరోవైపు సోషల్ మీడియా. ఇంకేముందు వరుసగా చంద్రబాబు పై ఉన్న కోరికను జగన్ తీర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించారు జగన్. ఐదేళ్ల పరిపాలన పగ్గాలు చేతపట్టారు. ఈ ఐదేళ్లు కూడా జగన్ గురించి కూడా గొప్పగా ప్రచారం చేయడానికి సొంత మీడియా ప్రచారం సరిపోదు. కాబట్టి సోషల్ మీడియా అయితే బాగుంటదని అలోచించి ఒక నిర్ణయానికి జగన్ వచ్చారు. ఆలోచన ప్రకారం సోషల్ మీడియా ను కూడా తన కనుసన్నల్లోనే పెట్టుకున్నారు. జగన్ ఉదయం నోరు విప్పింది మొదలుకొని రాత్రి నోరు మూసుకునే వరకు సోషల్ మీడియా ప్రచారం చేసేది.
తాజాగా సీఎం ఐదేళ్ల పరిపాలన పనితీరుకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఓటర్లు పాల్గొన్న తీరు చూసిన వైసీపీ నేతలకు ఇంటికెళ్ళడం ఖాయమని తేలిపోయింది. ఇన్నేళ్లు పెంచి పోషించిన సోషల్ మీడియా ఇప్పుడు మనకు అవసరమా అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పుడు మనకు ఉపయోగం లేని సోషల్ మీడియా ఇంటికి పంపిస్తే ఖర్చులు తగ్గిపోతాయనే ఆలోచన వైసీపీ నేతల్లో పుట్టింది. ఇది ఏ ఒక్క నాయకునికి వచ్చిన ఆలోచన కాదు, సాక్షాత్తు అధినేత జగన్ మెదడులో కూడా పుట్టింది. ఆయన కూడా అవసరం లేదని చెప్పేసారు. ఇంకేముంది ఐదేళ్లకు పైగా వాడుకొని ఇప్పుడు రోడ్డున పడేసింది వైసీపీ. దాదాపు గ 50 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది సోషల్ మీడియా కు
సోషల్ మీడియా ఆందోళన కాస్త వైసీపీ అధినేత జగన్ భార్య భారతీ రెడ్డి చెవిలో పడింది. ఆమె జోక్యం చేసుకొని గొడవ పెద్దది కాకుండా సోషల్ మీడియా సిబ్బందిని శాంతిమ్ప్ చేసింది. వాళ్లకు ఇవ్వాల్సిన 50 కోట్ల రూపాయలను ఆమె ముట్టచెప్పేయడంతో ఇప్పడు రోడ్డున పడిన సోషల్ మీడియా సిబ్బంది మరోదారి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.