YCP VS TDP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం ముగిసినది. మరి కొద్ధి గంటల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఫలితాలను ప్రకటించడానికి ఏర్పాట్లు చేసింది. ప్రధాన పార్టీలు గెలుపు ధీమాలో ఉన్నాయి. శనివారం రోజు కూటమి నాయకులతో పాటు వైసీపీ నాయకులకు కూడా పెద్ద తలనొప్పి వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ కోర్ట్ కు వెళ్ళింది. దీనికి సంబందించిన తీర్పు శనివారం సాయంత్రం వెల్లడి కానుంది. అదేవిదంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూస శనివారం సాయంత్రమే విడుదల కానున్నాయి. ఈ రెండు కూడా ఒకేసారి రావడంతో నాయకుల్లో గుబులు మొదలైనది. కోర్టు తీర్పు ఎవరికీ అనుకూలంగా రానుందో అంతుపట్టడంలేదు. అదేవిదంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరికి మద్దతుగా రానున్నాయి తెలియని పరిష్టితి ఉంది. ఈ రెండిటి వలన ఎవరి ఆశలు గల్లంతు అవుతాయో తెలియక నాయకులు ఆందోళన చెందుతున్నారు.
కోర్ట్ లో ఒకవైపు ఎన్నికల కమిషన్ తరుపున వాదనలు ముగిశాయి. మరోవైపు వైసీపీ తరపున కూడా న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో ఉన్న ఉత్తర్వుల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నామని, ఇందులో కొత్త సంప్రదాయం ఏమి లేదని ఎన్నికల కమిషన్ వాదన. కానీ వాస్తవానికి కోర్టుకు వైసీపీ వెళ్ళడానికి కారణం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పక్కా కూటమి అభ్యర్థులకే పడ్డాయి. ప్రతి నియోజకవర్గంలో సుమారుగా నాలుగు వేల ఓట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లు పోలైనాయి. వీటితో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో పదిహేను స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే వైసీపీ అభ్యర్థులు బయట పడ్డారు. అదే ఇప్పుడు నిజం కాబోతుందనే అనుమానంతో ఫలితాలను అడ్డుకోడానికి వైసీపీ కోర్ట్ దాక వెళ్లిందని ఆరోపణలు ఏపీలో వ్యక్తం అవుతున్నాయి.