TDP : క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి షేక్ మీర్ వలితో పాటు 5 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి నా బాధ్యతలను నిర్వర్తిస్తాను అని అన్నారు. 13వ తేదీన ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ (ఈవీఎం) సంఖ్య 3 సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.