YCP social media : వైఎస్ఆర్ జిల్లాలోని వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేకానందరెడ్డి, కో-కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్ లకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో విచారణకు శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు. దీంతో వారి ఇళ్లకు నోటీసులను పోలీసులు అంటించి, వారి కోసం గాలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు కీలక నేతలపై అసభ్యకర్ పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఐటా యాక్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డి, గుర్రంపాటి వెంకటసుబ్బారెడ్డి, గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.