JAISW News Telugu

YCP Rajya Sabha MPs : రాజ్యసభ సభ్యులుగా వైసీపీ అభ్యర్ధుల గెలుపు.. జగన్ ను కలిసిన వై. వి సుబ్బారెడ్డి..

YCP Rajya Sabha MPs

YCP Rajya Sabha MPs

YCP Rajya Sabha MPs : 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభలో టీడీపీని ఖాళీ చేశామని ఇప్పుడు ఇక పెద్దల సభలోనూ టీ డీపీని ఖాళీ చేశామని వైవీ సుబ్బారెడ్డి  అన్నారు. సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఖాళీ చే స్తామన్నారు. పార్టీ మారిన వాళ్లు మళ్లీ తిరిగి వైసీ పీలోకి వస్తారని జోస్యం చెప్పారు. ప్రజాబలం ముందు ప్రలోభాలు పనిచేయవన్నారు.

రాజ్యసభ  సభ్యుడిగా అసెంబ్లీ ఆవరణలో ధ్రువీక రణ పత్రం తీసుకున్న వై వి సుబ్బారెడ్డి, పెద్దల స భకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయాలని భావించిందని, వైసీపీ ఎమ్మెల్యేలు అం తా సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉన్నారని, అం దుకే రాజ్యసభలో ఏకగ్రీవంగా గెలవగలిగామని చెప్పారు.

టీడీపీని రాజ్యసభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వై ఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని సుబ్బారెడ్డి చెప్పారు.. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ అవుతుందన్నారు. వైసీపీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగివస్తున్నారన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని, సీఎం జగన్ తో ఉంటేనే ఎవ రికైనా రాజకీయంగా మంచి జరుగుతుం దన్నా రు. సీఎం జగన్‌తో జనం ఉన్నారని చెప్పారు.

ఏపీలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేసిన వేశారు. ఈ మూడు స్థానాల గెలుపుతో.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఏకగ్రీవమైన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులు ధృవ పత్రాలను అందించారు.

తాజా ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల త ర్వా త రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేకుండా పోయా రు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజ్యస భ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఓడిపోతే వాటి ప్రభా వం ఎన్నికలపై ఉంటుందనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Exit mobile version