YCP MP Daughter : యాక్సిడెంట్ కేసులో వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని బిసెంట్‌నగర్‌లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడు అక్కడికక్కడే చనిపోయారు. కారుతో ఢీకొట్టి అతడి మృతికి కారణమైనందున ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడు రాజధాని చెన్నై బెసంట్‌నగర్‌కు చెందిన సూర్య (22) పెయింటర్. సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో బెసంట్‌నగర్ కళాక్షేత్రకాలనీ వరదరాజసాలైలో ఫుట్‌పాత్‌పై నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చి సూర్యమీదకు ఎక్కింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్యను పోలీసులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు మహిళలున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. వాహనం నడిపిన మహిళ అక్కడి నుంచి కారుతో పాటు పరారైంది. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన ప్రజలతో గొడవ పెట్టుకుంది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. ఆ ఇద్దరు మహిళలూ మద్యం మత్తులో ఉన్నట్లు చనిపోయిన సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్ నంబర్, పారిపోయిన మహిళల ఫొటోలున్నాయి. అయినా వారిని అరెస్టు చేయలేదని వారు సోమవారం రాత్రి బెసంట్‌నగర్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఏపీకకు చెందిన వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తె బీద మాధురిగా గుర్తించారు.