YCP MP Magunta : ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు. ఈనెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలోకి చేరనున్నారు. రెండు, మూడు రోజుల్లో టీడీపీలో చేరే తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈసారి కొడుకు రాఘవ రెడ్డిని ఒంగోలు నుంచి టీడీపీ అ భ్యర్థిగా బరిలోకి దించే యోచనలో మాగుంట ఉ న్నారు.
మాగుంట చేరికతోపాటు రాఘవరెడ్డిని ఎంపీ అభ్య ర్థిగా బరిలో నిలిపేందుకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. మాగుంట రాక తో ఒంగోలు పార్లమెంట్ సగ్మెంట్ లో టీడీపీ బలం పెరగనుంది.
మాగుంట శ్రీనివాసులు టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. మరో రెండు మూడు రోజుల్లో టీడీపీ లో చేరే తేదీ ఫైనల్ అవుతుందని మాగుంట వర్గీ యులు భావిస్తున్నారు. అయితే, గతంలో ముహూ ర్తం విషయంలో సరిగా నిర్ణయం తీసుకోలేదని కొం దరు పురోహితులు ఆయన వద్ద ప్రస్తావించార ట.. ఈ నేపథ్యంలో ఈసారి మంచి ముహూర్తం చూసు కొని టీడీపీలో చేరాలని మాగుంట భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంచి ముహూర్తంపై పు రోహితులను మాగుంటి సంప్రదించగా.. ఈ నెల చివరి వారంలో, మార్చి మొదటి వారంలో పలు తేదీలను సూచించినట్లు సమాచారం.
టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కొడుకు రాఘ వరె డ్డిని బరిలోకి దింపాలని మాగుంట భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం నుంచిసైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. గత పది రోజుల నుంచి ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా టీడీపీ బలాబలాలపై మాగుంట ఆరా తీస్తున్నారని ఆయన వర్గీయుల నుంచి తెలుస్తోంది. టీడీపీలో చేరే నాటికి నియోజ కవర్గం పరిధిలో లోటుపాట్లు గుర్తించి, టీడీపీలో చేరిన తరువాత అధిష్టానం సహకారంతో వాటిని చక్కదిద్దుకునేందుకు మాగుంట దృష్టిసారించినట్లు సమాచారం.