YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 26న తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకుని పలు జనాకర్షక పథకాలను ప్రకటించే అవకాశముంది.
2024 సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. అయితే ఎన్నకలకు నెల రోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్టీలేవీ మేనిఫెస్టోను విడుదల చేయలేదు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ఈ నెల 26న మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈసారి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యమయ్యే అంశాలే ఉంటాయని, ప్రస్తుతం ఉన్న పథకాలతో పాటు పలు జనాకర్షక పథకాలు ఉంటాయని సమాచారం. ఈసారి వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.