Peddireddy : వైసీపీ నేత అక్రమ వ్యాపారం క్లోజ్.. పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం..

Peddireddy

Peddireddy

Peddireddy : ఆంధప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం గత వైసీపీ నాయకుల అవినీతి, అక్రమ వ్యాపారాలను బట్టబయలు చేస్తుంది. ఇప్పటికే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఇసుక, సీఫుడ్ ఎగుమతి వ్యాపారాల్లో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి అక్రమంగా నిల్వ చేసుకున్న ఇసుక డంప్ ను ఇరిగేషన్ శాఖ అధికారులు మంగళవారం (జూలై 09)న సీజ్ చేశారు.

అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశాలతో ములకలచెరువు మండలం రెడ్డివారిపల్లి గ్రామ సమీపంలో భారీగా నిల్వ ఉన్న ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని సంగమేశ్వరస్వామి ఆలయం సమీపంలోని పాపాగ్ని నది నుంచి ఇసుకను తవ్వి రెడ్డివారిపల్లి సమీపంలో నిల్వ చేశారు. కాలువ పనుల కోసం ఇసుకను నిల్వ చేశారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

2022లో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీ వాహనాలు ఇసుకను తరలించి ఇక్కడ నిల్వ చేశాయి. ఆ సమయంలో నిత్యం సుమారు 100 టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం.

వైసీపీ హయాంలో గండికోట రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కు నీటిని తరలించే పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు-నగరి కాలువను పెదమండ్యం, తామరపల్లి, ములకలచెరువు మీదుగా హంద్రినీవా కాలువకు అనుసంధానం చేసేందుకు రెడ్డివారిపల్లి సమీపంలో ఇసుక భారీగా పేరుకుపోయింది.

అయితే కొన్ని నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఇసుక డంప్ ను సీజ్ చేయాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. సుమారు 27,472 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

TAGS