YCP Leaders : రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్న వైసీపీ నేతలు.. కేడర్ లో మొదలవుతున్న గుబులు..
YCP Leaders : ‘వై నాట్ 175 సీట్స్’, ‘వై నాట్ కుప్పం’.. ఇవి పోలింగ్ కు ముందు వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం జగన్ నినాదాలు. పార్టీ సమావేశాలు, బహిరంగ సభలు, కేడర్ మీటింగ్ ఇలా ప్రతీ చోట ఈ రెండు మాటలు లేనిదే మీటింగ్ పూర్తయ్యేది కాదు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక నేతలు వాస్తవాన్ని గ్రహించారు.
కౌంటింగ్ కు ముందే కూటమి నేతలు దేశం విడిచిపోతున్నారని వైసీపీ తన సొంత బ్లూ మీడియాలో కోడై కూస్తున్నా.. మరి వైసీపీ నేతల మాటేంటి? కూటమి నేతల కంటే ఎక్కువ సంఖ్యలో వైసీపీ నేతలు దేశం విడిచిపోతున్నారన్న వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇందులో పెద్ద పెద్ద నాయకులు ఉండడంతో కేడర్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది.
పోలింగ్ రోజు దాడులకు కారణమైన పిన్నెల్లి సోదరులు పరారీలో ఉండడంతో భయంతో చెల్లా చెదురైన ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యేను 5వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని, పోలీసులను ఆదేశించింది.
పిన్నెల్లి వెంట కర్రలు, రాడ్లతో దాడులు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైసీపీ కేడర్ ఇప్పుడు భయాందోళనకు గురవుతోంది. ఈ దఫా తమ నాయకుడు గెలిస్తే మంత్రి అవుతారని భావించారు. అయితే, ఆయన, ఆయన తమ్ముడు పారిపోతే తమకు నాయకుడు ఎవరని వాపోతున్నారు.
ఒక్క మాట కూడా మాట్లాడకుండా గన్నవరం నుంచి ఎంత మంది వెళ్లిపోయారో తెలియడం లేదు. శాశ్వత వీసా కోసం వంశీ ఈబీ5 ప్రోగ్రాం కింద అమెరికా వెళ్లడం ఆయన అనుచరులను ఆశ్చర్యానికి గురి చేసింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ వెళ్లి పిన్నెల్లి అరెస్టుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
పుంగనూరులో పోలింగ్ ముగిసిన తర్వాత పెద్దిరెడ్డి చెన్నై పోర్టు ద్వారా ఆఫ్రికాకు సామగ్రిని పంపి కౌంటింగ్ కు ముందే పారిపోయేందుకు సిద్ధమయ్యారు. తిరుపతిలోని చంద్రగిరిలో జరిగిన హింసాకాండ తర్వాత తన కుమారుడు మోహిత్ రెడ్డిని దేశం నుంచి ఎలా పంపించాలని చెవిరెడ్డి ఆలోచిస్తున్నారు.
వంద మందికి పైగా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. సంపన్న అధికారులు, అనుచరులు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ నేతల తీరు క్యాడర్ లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.