JAISW News Telugu

MLA Srinivas : వైసీపీ నేత ఫిర్యాదు.. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ పై కేసు నమోదు

MLA Srinivas : ఎన్టీఆర్ జిల్లా తిరుపూర్ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై కేసు నమోదైంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేతో గొడవ కారణంగా ప్రతిపక్షాలు ఆయన తీరును ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదైంది. తన ఇంటిని అక్రమంగా కూల్చివేశారని ఎ.కొండూరు మండలం కంభంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా, ఎంపీపీ అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్నారనే నెపంతో ఎమ్మెల్యే కొలికపూడి తన అP-2నుచరులతో కలిసి ఎంపీపీకి చెందిన భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. ఈ ఘటన ఏపీలోమ సంచలనం సృష్టించింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ప్రతిపక్ష నాయకుల కట్టడాలు కూల్చడం ఏంటని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Exit mobile version