
Butta Renuka – Anam Ramanarayana Reddy
Minister Anam-Butta Renuka : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో వైసీపి నేత బుట్టా రేణుక భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు నుంచి వైసీపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన బుట్టా రేణుక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సమావేశమయ్యారు. ఆమె టీడీపీలో చేరేందుకే మంత్రితో సమావేశమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, బుట్టా రేణుక 2014 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కర్నూలు లోక్ సభ స్థానంలో గెలుపొందారు. ఆమె రూ.300 కోట్ల కంటే ఎక్కు ఆస్తులు గల ధనిక ఎంపీలలో ఒకరు. కాగా, ఇటీవల ఎన్నికలలో ఎమ్మిగనూరు నుంచి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీచేసి ఓడిపోయారు.