Raghu Rama:బీఆర్ఎస్ పై ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు
Raghu Rama:ఇటీవల రసవత్తరంగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని మ్యాజిక్ ఫిగర్‌ని మించి అత్యధిక స్థానాలని దక్కించుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ మాత్రం 39 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. దీంతో తెంలగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీ తొలి సారి అధికార పీఠాన్ని అధిరోహిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్సాట్లు చకచకా జరుగుతున్నాయి. పార్టీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిస్ఠానం స్పష్టమైన సంకేతాల్ని పంపించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `బీఆర్ఎస్ గెలుపు కోసం నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు డబ్బు తరలించారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బు తరలింపునకు కేసీఆర్, వైఎస్ జగన్ ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అతను తెలంగాణ ప్రగతిభవన్‌లో కూర్చుని గెలుపు స్థానాలపై సర్వే చేశారని తెలిపారు. ఇది నిజమో కాదో ఆ పార్టీ నేతలు తమ గుండెలపై చేయి వేసుకుని చెప్పాలని సవాల్ విసిరారు. నాగార్జు సాగర్ వివాదాన్ని కూడా కావాలనే ఎన్నికల రోజు తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. మరి రఘురామ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.