YCP Goondaism : ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. కానీ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరిగాయి. తెనాలిలో వైసీపీ అభ్యర్థి సామాన్యుడిపై చేయి చేసుకోవడం వంటి ఘటనలు జనాలను ఆలోచింపజేశాయి. వైసీపీ నేతల గూండాయిజం ఎలా ఉంటుందో జనాలకు అర్థమైపోయింది. గత ఐదేండ్ల పాలనలో వైసీపీ చేసిన ఘనకార్యం చూసే ఉన్నారు. కానీ ఎన్నికల వేళ కూడా వైసీపీ నేతలు ఇలా బరితెగిస్తారని ఎవరూ ఊహించలేదు.
ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయి. తాజా అనధికార అంచనాల ప్రకారం ఓటమి తప్పదు అని వారికి తెలిసిందేమో.. దాడులకు తెగబడ్డారు. ఒకప్పుడు అల్లర్లు, గూండాయిజం అంటే బిహార్, యూపీ గుర్తొచ్చేవి. కానీ వాటిని తలదన్ని ఏపీలో ఇలా చెలరేగిపోవడం జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో వైసీపీ శ్రేణులు కత్తులు, పెట్రోల్ బాంబులు, రాడ్లతో హల్ చల్ చేయడంపై జనాలు వణికిపోతున్నారు.
జూన్ 4న వచ్చే ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తే ఆ పార్టీ గూండాల అరాచకాలు ఎలా ఉంటాయో అని ప్రజలు వణికిపోతున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు. ఎన్నికలు జరిగిన తెల్లారే ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తాయనే భావనతో నానా ఆగడాలు సృష్టిస్తున్న వైసీపీ మూకలు రేపు ఓటమిని సహించగలరా? ఇలాంటి దాడులు ఎన్ని చేస్తారో అని ప్రజలు భయపడిపోతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం అలర్ట్ గా ఉండి వైసీపీ మూకల నుంచి ప్రజలను రక్షించాలని వారు కోరుతున్నారు.