JAISW News Telugu

YCP Fourth List : వైసీపీ నాలుగో జాబితా విడుదల.. తమదైన వ్యూహంలో చంద్రబాబు, పవన్..

YCP Fourth list : రెండు, మూడు నెలల్లో జరిగే ఎన్నికల కోసం వైసీపీ సర్వం సిద్ధమైంది. తాజాగా నాలుగో లిస్ట్ కూడా ప్రకటించింది. ఇప్పటికే 50 ఎమ్మెల్యే అభ్యర్థులను, 9 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత జగన్ మరికొన్ని స్థానాలకు ఇన్ చార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా లిస్ట్ ను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

కాగా, మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ చార్జిలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా లిస్ట్ వివరాలిలా ఉన్నాయి..

గోపాలపురం(ఎస్సీ): తానేటి వనిత(హోంమంత్రి)
జీడీ నెల్లూరు(ఎస్సీ): రెడ్డప్ప
తిరువూరు (ఎస్సీ):  నల్లగట్ల స్వామిదాసు
సింగనమల (ఎస్సీ): ఎం. వీరాంజనేయులు
కొవ్వూరు(ఎస్సీ):   తలారి వెంకట్రావు
మడకశిర(ఎస్సీ): ఈర లక్కప్ప
నందికొట్కూరు(ఎస్సీ): డాక్టర్ సుధీర్ ధార
కనిగిరి(బీసీ): దద్దాల నారాయణ యాదవ్

ఇక చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇన్ చార్జిగా నియమించింది. తాజాగా ప్రకటించిన 8మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఏడుగురు ఎస్సీలు ఉండగా, ఒకరు బీసీ ఉన్నారు.

175 సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్ .. మిగతా పార్టీల అభ్యర్థుల కంటే ముందుగా ప్రకటిస్తూ జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. కూటమి అభ్యర్థుల ప్రకటన రాకముందే జగన్ పార్టీ అభ్యర్థులు ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసేలా చూస్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థుల కంటే బలమైన అభ్యర్థులను బరిలో దించేలా  టీడీపీ-జనసేన కూటమి చంద్రబాబు, పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈమేరకు జాబితా ఆలస్యమైనా.. గెలుపు ఖాయమనే భరోసాతో ఉన్నారు.

గతంలో తెలంగాణలో కూడా అధికార పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించినా.. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నామినేషన్ల చివరి రోజు నాడు ప్రకటించిన గెలిచారు. ఇదే స్ట్రాటజీని కూటమి నేతలు అమలు చేస్తున్నట్టు కనపడుతోంది. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని నమ్ముతున్నారు.

Exit mobile version