MP Byreddy Shabari : కేంద్రం నిధులను వైసీపీ పక్కదారి పట్టించిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్ సభలో ఆమె తొలిసారి మాట్లాడారు.
‘‘హైదరాబాద్ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. టీడీపీ హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైసీపీ పాలనలె అభివృద్ధి శూన్యం. అందుకే ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసింది. టీడీపీ హయాంలో పోలవరం 70% నిర్మాణం పూర్తయితే వైసీపీ ప్రభుత్వం ఒక్క శాతం పనులు కూడా చేయలేకపోయింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాను ఆ పార్టీ నడిపించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా’’ అని ఎంపీ శబరి విజ్ఞప్తి చేశారు.