YCP : వైసీపీ క్లీన్ స్వీప్ పక్కా.. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ప్రజల తీర్పు: వైసీపీ

YCP

YCP

YCP : వైసీపీ 2024 ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయబోతుందని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఐ ఫ్యాక్ టీంతో భేటీ అయిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గత సారి ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అందరి అంచనాలను తలకిందులు చేసిందని గుర్తు చేశారు. వై నాట్ 175 అనే నినాదంతో ప్రచారం చేసిన జగన్ కు ఈ సారి చాలా వరకు సానుకూల ఫలితాలే వస్తాయని నమ్ముతున్నారు.

175 సీట్లు వస్తాయని గవర్నమెంట్లో చేపట్టిన సంక్షేమ పథకాలే మనల్ని గెలిపిస్తాయని నమ్ముతున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ చేపట్టిన పథకాలు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ వైసీపీని ప్రజల వద్దకు చేరువ చేసిందని విశ్వసించారు. జగన్ ఈ సందర్భంగా గెలుపుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

వైసీపీ గతంలో 151 సీట్ల కోసం ప్రయత్నం చేసినపుడు ఎల్లో మీడియాతో పాటు అనేక చానళ్లు వైసీపీ గెలవడమే కల్లా అని కొట్టిపారేశారు. కానీ వైసీపీ అందరి అంచనాలను తలకిందులు చేసి 151 స్థానాల్లో గెలిచి విజయభేరీ మోగించింది. అందుకే ఈ సారి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమి పేరుతో వైసీపీ ని ఓడించాలని కక్ష గట్టాయని దీన్ని ప్రజలందరూ గమనించారని జగన్ అన్నారు.

ఈ సారి విజయం మామూలుగా ఉండదని జగన్ చెప్పారు. వైసీపీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 175 సీట్లు సాధించిన తర్వాత మళ్లీ అందరినీ కలుస్తానని అన్నారు. వైజాగ్ లోనే మళ్లీ సీఎంగా పదవీ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ఇంతలా జగన్ విశ్వాసం పెంచుకోవడానకి కారణం ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలే అని తెలుస్తుంది. మరి జగన్ అనుకున్న విధానంలో రిజల్ట్ వస్తుందా.. కూటమి ప్రభంజనం కనిపిస్తుందా? అనేది జూన్ 4 వ తేదీన తేలిపోనుంది.

TAGS