PM Modi : రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ వైసీపీని ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి జరుగలేదని విమర్శించారు. ‘ఐదేళ్లుగా యువతకు ఉద్యోగాలు లేవు. రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలను మోసం చేసింది. మాఫియా వికాసం కోసం వైసీపీ పనిచేసింది. వైసీపీ అవినీతి వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి’ అని మోదీ అన్నారు.
రాయలసీమలో ఖనిజ సంపద ఉందని, పర్యాటకంగా కూడా రాయలసీమను అభివృద్ధి చేయడానికి అవకాశముందని అన్నారు. జల్ జీవన్ మిషన్ కు వైసీపీ ప్రభుత్వం సహకరించటం లేదని మోదీ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మాఫియాలన్నింటికి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు.