YCP Cheap Tricks : ఆంధ్రప్రదేశ్ లో రౌడీ రాజకీయం నడుస్తోంది. అడ్డొచ్చిన వాళ్లను అరెస్టు చేయించి కేసులు పెడుతూ కాలం గడుపుతున్నారు. జగన్ కు అధికారులు కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విషయం తెలిసినా న్యాయానికి సంకెళ్లు వేస్తున్నారు. ఫిర్యాదులు చేసిన వారిపైనే కేసులు బనాయించి వారినే జైళ్లలో వేస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారికి అరదండాలే దర్శనమిస్తున్నాయి.
ఈనేపథ్యంలో బొండా ఉమాను టార్గెట్ చేసుకుని సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆడుతున్న నాటకం ప్రజలకు తెలుసు. పోలీసులతో కలిసి ఉమను ప్రచారం చేయకుండా చేస్తున్నారు. అక్రమంగా కేసులు బనాయించి ప్రచారానికి వెళ్లకుండా అరెస్ట్ చేసే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులతో కలిసి సజ్జల చేస్తున్న దురాగాతాలకు అంతే లేకుండా పోతోంది.
ఎవరైనా అడ్డు వస్తే తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పించి పోలీసులతో కొట్టిస్తున్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. వైసీపీ నేతల దోపిడీలకు అంతం లేకుండా పోతోంది. విచక్షణారహితంగా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని వారిని భయపెడుతూ భయానక వాతావరణం కల్పిస్తున్నారు. ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వస్తే వారిని ఏదో కేసులో ఇరికించడం అలవాటుగా మారింది.
తెలంగాణలో కూడా పదేళ్లు బీఆర్ఎస్ నేతలు తమకు ఎదురే లేదన్నట్లు విర్రవీగారు. ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల తరువాత ఇంకా ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ లు బలవుతారో తెలియడం లేదు. ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంటుందని అంతా అనుకుంటున్నారు. చెడు ఎంత కాలం నిలుస్తుంది. మంచి పనులు చేయకుండా చెడు పనులు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
ఏపీలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది. పోలీసులు ఐదేళ్లుగా దారి తప్పారు. న్యాయమైనా అన్యాయమైనా పోలీసులు వైసీపీ వైపు నిలుస్తున్నారు. దీంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై సానుభూతితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సహజంగానే వస్తున్నాయి. దీంతో వైసీపీ పాలన పోతే టీడీపీ పాలన వస్తే ఎలా అనే వాదన కూడా వస్తోంది.