TDP Super 6 : తెలుగుదేశం పార్టీ మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించింది. దానికి ‘సూపర్ 6’ అని పేరు పెట్టింది. ఈ మేనిఫేస్టోను టీడీపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. సొంత పార్టీ లేదా మహా కూటమి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వేరు.. కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా ప్రచారం చేయడం చూస్తూంటే నవ్వస్తోంది. సూపర్ 6పై జగన్మోహన్ రెడ్డి తన బహిరంగ సభల్లో ప్రస్తావించి చాలా నిధులు అవసరం అవుతాయమని ఖజానాలో అంత డబ్బు లేదని చెబుతూ వస్తున్నారు.
వర్క్ ఫ్రం ప్యాలెస్ చేసి.. రాష్ట్రానికి పెట్టుబడులు రానీయకుండా.. వ్యాపారం డెవలప్ చేయని జగన్ రెడ్డి.. పథకాలు ఇస్తే.. ప్రపంచం మొత్తం తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చి డెవలప్ పనులు చేయించే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేరన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వైసీపీది. సంపద సృష్టి అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. జగన్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయితే మా ఆస్తులు 90 శాతం పడిపోతాయోనని ఆందోళన చెందుతున్న వారు ఉన్నారు. బాబు వస్తే ఆస్తుల విలువ పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘సూపర్ 6’కు బడ్జెట్ ఎంత అవుతుందో వైసీపీ మేధావులు విశ్లేషిస్తున్నారు. మరి కొంత మంది చేతులు ఎత్తేశారని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే టీడీపీ మినీ మేనిఫెస్టోకు ఉచిత ప్రచారం కల్పిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఎంతగా చర్చ జరిగితే.. టీడీపీ మినీ మేనిఫెస్టోకు అంత లాభం. ఈ విషయంలో తెలుగుదేశం కూడా వైసీపీ మీడియా, సోషల్ మీడియాను ట్రాప్ లో పడేసేందుకు ప్రయత్నిస్తోంది.