YCP : పోతిన, పోసానిలపై ఆధారపడిన వైసిపి
YCP : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని రెండోసారి అధికారంలోకి రాకుండా జనసేన అధినేత,ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీతోపాటు భారతీయ జనతా పార్టీ తో జత కట్టాడు.ప్రస్తుత సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్న తీరుతో వైసీపీ నాయకులు,కార్యకర్తలు,పార్టీ ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులు తట్టుకోలేక తలపట్టుకుంటున్నారు.పవన్ ప్రసంగాలను అడ్డుకోడానికి మార్గం లేదా అనే ఆలోచనలో పడ్డారు.
సినిమా ఆర్టిస్టుకు సినిమా ఆర్టిస్టు అయితేనే సరిగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ముందుగా పోసాని మురళి కృష్ణ ను రంగంలోకి దించారు. పోసాని మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు అసహ్యించుకునే స్థాయికి వచ్చింది.పోసాని మాటలను ఎవరు కూడా అంతగా పట్టించుకోవడం లేదు.ఆయన భాష, వ్యవహారం పలు దశల్లో వైసిపి నేతలకే నచ్చలేదు.పవన్ ను పోసాని విమర్శిస్తుంటే జనం చప్పట్లు కొట్టాల్సింది పోయి,తిరిగి పోసానిని విమర్శించే పరిస్థితి వచ్చింది.పోసాని వద్దంటూ అధినేత జగన్ కు ఫిర్యాదులు వెళ్లాయి.పోసాని స్థానంలో పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి మరో సినీ ఆర్టిస్టు పోతిన మహేష్ ను తీసుకు వచ్చారు.పోతని మహేష్ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మోచేయి నీళ్లు తాగి కడుపు నింపుకున్నోడే.తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టు సామెతలా మహేష్ గతాన్ని మరచిపోయి పవన్ కళ్యాణ్ ను తిట్టడంతో జనం తోపాటు ఆయన అభిమానులు జనసేన సైనికులు ఆశహ్యించుకుంటున్నారు. పవన కళ్యాణ్ ను తిట్టడానికి పోతని మహేష్ వైసిపి అధినేత వద్ద ఎన్ని కోట్లు తీసుకున్నాడో అంటూ జనం చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ను ఎదుర్కొలేక సినీ ఆర్టిస్ట్ లతో తిట్టించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పోతిన మహేష్, పోసాని మురళి కృష్ణ లపై సీఎం జగన్ ఆధారపడిన తీరు చూసి వైసిపి నేతలకు మతిభ్రమించినదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతే కానీ తోటి నటులతో అంత పెద్ద నాయకున్ని తిట్టడం సరికాదంటున్నారు ఓటర్లు. అభివృద్ధి గురించి మాట్లాడాలి. అధికారం ఇస్తే ప్రజలు ఏమి చేస్తామో ప్రకటించాలి.చేసిన అభివృద్ధి గురించి జనంలో మాట్లాడాలి. అంతే కానీ డబ్బులు ఇచ్చి సినీ నటులతో అంత పెద్ద నటుణ్ని జనంలో తిడితే ఓట్లు రావని జనం బాహాటంగానే విమర్శిస్తున్నారు.