Pedakurapadu : టీడీపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు

Pedakurapadu

Pedakurapadu

Pedakurapadu : పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. సోమవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న రథం వద్దకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ప్రచార రథం అద్దాలు పగులగొట్టారు. ఫ్లెక్సీలు చింపివేసిన అల్లరిమూకలు కళాకారులపై విచక్షణా రహితంగా దాడి చేశారు.  

ఈ దాడిలో ప్రచార రథం ధ్వంసం కాగా, కళాకారులు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ ప్రచార రథంపై వైసీపీ శ్రేణుల దాడిపై స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి పెరిగిన ప్రజాదరణ ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారని, దాడికి పాల్పడ్డవారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

TAGS