Yatra 2 Trailer Review : ‘యాత్ర 2’ ట్రైలర్ రివ్యూ..సీఎం జగన్ పాత్రలో జీవించేసిన హీరో జీవా!

'Yatra 2' trailer review

‘Yatra 2’ trailer review

Yatra 2 Trailer Review : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ జీవిత చరిత్ర ని, ఆయన రాజకీయ ప్రయాణం ని ఆధారంగా తీసుకొని మహి వి రాఘవ్ అనే దర్శకుడు ‘యాత్ర 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఈనెల 8 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. 2019 ఎన్నికలలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ తెరకెక్కింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రము లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు, ఆ తర్వాత జగన్ ని కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టింది?, వాటి అన్నిటిని ఎదురుకొని ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, తొలిసారి ఓటమి పాలైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు, ఇలాంటి సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్.

కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ర గోపాల్ వర్మ లాగ అర్థవంతంగా, సీఎం జగన్ ని ఎలివేట్ చెయ్యడం కంటే ఎక్కువగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని కించపర్చడానికే తీసినట్టు కాకుండా, కేవలం జగన్ మీద, ఆయన చేసిన మంచి మీద ఫోకస్ చేస్తూ, ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా ఈ ట్రైలర్ ని చూసినప్పుడు అనిపించింది. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. జనాలను ఆలోచింపచేసేలా కూడా ఈ డైలాగ్స్ ని రాసాడు డైరెక్టర్ మహి వి రాఘవ్. ఇక సీఎం జగన్ పాత్రలో తమిళ నటుడు జీవ నటించాడు అనడం కంటే కూడా జీవించాడు అని చెప్పడం ఉత్తమం.

జగన్ నడిచే తీరు, ఆయన ముఖం పలికే హావభావాలు, అన్నీ కూడా ప్రింట్ దింపేసాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన జగన్ బయోపిక్ ‘వ్యూహం’ కంటే కూడా, ఈ ‘యాత్ర 2 ‘ వెయ్యి రెట్లు బాగుంది అనే చెప్పాలి. ముఖ్యంగా క్వాలిటీ పరంగా చూస్తే వ్యూహం ట్రైలర్ ‘యాత్ర 2’ కి దరిదాపుల్లోకి కూడా రాదని చెప్పొచ్చు. అన్నీ రకాల ఎమోషన్స్ ని టచ్ చేస్తూ చేసిన ఈ సినిమా కచ్చితంగా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని మేకర్స్ అనుకుంటున్నారు.

TAGS