నటీనటులు : మమ్ముటి , జీవా, మహేష్ మంజ్రేకర్ తదితరులు
దర్శకత్వం : మహి వి రాఘవ్
నిర్మాత : శివ మేక
సంగీతం : సంతోష్ నారాయణ్
Yatra 2 Review : సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. ఒక్క హనుమాన్ చిత్రం మినహా సంక్రాంతికి విడుదలైన మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రీసెంట్ గా పలు చిన్న సినిమాలు విడుదలై పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ రప్పించుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయాయి. ఇలాంటి సమయం లో ఇప్పుడు అందరి చూపు ‘యాత్ర 2’ మీద పడింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి వి రాఘవ్. ఇందులో జగన్ పాత్రని తమిళ హీరో జీవా పోషించగా, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ని మలయాళం హీరో మమ్మూటీ పోషించాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చెయ్యడం తో యాత్ర 1 ముగిస్తుంది. ఆ తర్వాత ఆయన పాలన ఎంత అద్భుతంగా ఉండేది, రెండవసారి ముఖ్యమంత్రి అయ్యి హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోయిన ఘటనల గురించి ఈ సినిమా ప్రారంభం లో చూపిస్తారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రం లో ఏర్పడిన పరిస్థితులు , ఆయన్ని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ‘ఓదార్పు యాత్ర’ చేస్తుంటే ఎలా అడ్డుపడింది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు.
జగన్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కి ఎదురు తిరిగి సొంతగా పార్టీ పెట్టి బయటకి వచ్చిన తర్వాత అతనిపై అక్రమంగా ఎలాంటి కేసులు పెట్టింది?, 16 నెలలు జైలుకు రానివ్వకుండా ఎలా చేసింది వంటి అంశాలను చూపించారు. ఇక మొదటిసారి ఎన్నికలలో పోటీ చేసి పార్టీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ ఎదురుకున్న కష్టాలు, వాటిని అధిగమించి జగన్ పాదయాత్ర చెయ్యడం, ఆ తర్వాత అఖండ మెజారిటీ తో ముఖ్యమంత్రి అవ్వడం వంటివి ఈ సినిమాలో చూపించారు.
విశ్లేషణ:
ఈ సినిమాలో హీరో జీవా వై ఎస్ జగన్ పాత్రలో నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. జగన్ నడిచే తీరు ని, ఆయన మాట్లాడే తీరు వరకు ప్రతీ ఒక్కటి డిట్టో దింపేసాడు. ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమా కి ఇచ్చాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక వైఎస్ఆర్ పాత్రలో మలయాళం మెగాస్టార్ మమ్మూటీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.
రాజశేఖర్ రెడ్డి అప్పట్లో జనాలతో ఎలా మమేకం అయ్యేవారో, ఆయన రాజసం, ఆయన ఠీవి, అన్నీ మక్కీకి మక్కి దింపేసాడు. ముఖ్యంగా పాదయాత్ర చేస్తున్న సమయం లో హీరో పాత్రకి ఎదురైన సంఘటనలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయి. జగన్ సీఎం అయ్యే ముందు ఇన్ని కష్టాలను ఎదురుకున్నాడా? అని చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తాది. అంత గొప్పగా తీసాడు డైరెక్టర్ మహి వి రాఘవ్.
చివరి మాట :
ఓవరాల్ గా ఈ చిత్రం వైసీపీ పార్టీ అభిమానులకు రోమాలు నిక్కపొడిచేలా చేస్తుంది. మామూలు ఆడియన్స్ కి కూడా ఒక మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ కలుగుతుంది.
రేటింగ్ : 2.75/5