Yatra 2 : క్యాడర్ కొట్టిన దెబ్బకు యాత్ర-2 ప్లాప్
Yatra 2 : వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. దాని ఆధారంగా యాత్ర సినిమా నిర్మించారు. అప్పుడు ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడింది. పార్టీ ఇమేజ్ కారణంగా సినిమా హిట్ సాధించింది. ఇప్పుడు యాత్ర-2 సినిమా విడుదలైంది. యాత్ర సినిమా పార్టీపై అభిమానంతో చూడలేదు. నాయకులపై ప్రేమతో చూడలేదు.
ఇప్పుడు యాత్ర-2 ను ఆదరించడం లేదు. తొలి రోజు రూ. 2 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఇందులో గుంటూరు జిల్లా నుంచే వచ్చింది. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న విడదల రజనీ ఖాతాలో ఆ డబ్బు వచ్చింది. మిగతా చోట్ల మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. కొత్త సమన్వయ కర్తలు కూడా ఆ బాధ్యత తీసుకోలేదు. సొంత జిల్లా కడప క్యాడర్ కూడా అంతగా పట్టించుకోలేదు.
సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ను దివాళా తీయించారు. సొంత పాలనలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన అతడి పరిస్థితి అధ్వానంగా మారింది. ఈనేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు సైతం సినిమా చూసేందుకు సిద్ధంగా లేరు. క్యాడర్ కొట్టే దెబ్బకు యాత్ర-2 బ్రహ్మాండమైన ప్లాప్ ను మూటగట్టుకోవడం ఖాయమని అంటున్నారు. దీంతో జగన్ పరిస్థితి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు.
యాత్ర-2 సినిమా ఎన్నో ఆశలతో నిర్మించారు. పార్టీ కార్యకర్తలకు చైతన్యం కలిగించేందుకు తీసిన సినిమా కావడంతో అందరు చూస్తారని భావించారు. యాత్ర 2 కలెక్షన్ల మోత మోగిస్తుందని అనుకున్నారు. కానీ ఎలాంటి ప్రభావం చూపకుండా నిరాశే మిగిల్చింది. దీంతో సినిమాపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. క్యాడర్ సినిమా చూసేందుకు రెడీగా లేనట్లు తెలుస్తోంది.