Bigg Boss : డేంజర్ జోన్ లో యష్మీ.. బిగ్ బాస్ ఎలిమినేషన్ లో భారీ షాక్?
Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతున్నది. ప్రస్తుతంనామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఓటింగ్ రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇక సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం విష్ణు ప్రియ ఆఖరు స్థానంలో కొనసాగుతున్నది. అయితే ఆమె హౌస్ నుంచి వెళ్లిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకుంది. ఈస్థాయి పెరుగుదల గతంలో ఏ ఒక్కరికీ కనిపించేదు. ఇక రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చిన యష్మీ కి మాత్రం షాక్ తగిలింది. ఆమె ఆఖరుస్థాయికి చేరుకుంది. ఈవారం ఆమె ఫుటేజీ చూస్తే మిగతా వారందరి కంటే చాలా తక్కువగాఉంది.
ఇక మరో విషయం ఏంటంటే కంటెస్టెంట్ గౌతమ్ మాత్రం ఇప్పుడు లీడింగ్ లో ఉన్నాడు. 22 శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా వారు మాత్రం 16 శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నారు. ఇక యష్మీ ఒక్కరే 15 శాతం ఓటింగ్ తో ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది అంచనా వేయడం కష్టసాధ్యంగా మారింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. కంటెస్టెంట్స్ అంతా బాగున్నారనేది అందరి అభిప్రాయం. అయితే ఎలిమినేషన్ అయ్యేవారు మాత్రం కేవలం స్వల్ప తేడాతో అవుతారని తెలుస్తున్నది.
ఇక యష్మీతో పాటు అవినాష్ కు కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తున్నది. ఓటింగ్ ప్రక్రియ ఎండ్ అయ్యే సమయానికి అవినాష్ చిట్టచివరి స్థానంలో ఉన్నట్టు సమాచారం. అయితే ఎలిమినేషన్ రౌండ్ సందర్భంగా ఎవరో ఒకరికి ఏవిక్షన్ ఫ్రీ పాస్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఎలిమినేషన్ అనేది ఉండదు. అయితే యష్మీ, అవినాష్ సేఫ్ అయినట్లేనని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా మారింది. ఈ సారి బిగ్ బాస్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.