Prudhvi Raj : తెలుగు నాట సినిమాలు, రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సినిమా రంగం నుంచి వెళ్లిన వారు సీఎం కూడా అయ్యారు. అలాగే మిగతా వారు రాజకీయాల్లో ఎంతో కొంత ప్రభావం చూపించిన వారే. తాజాగా పలు పార్టీల్లో సినిమా నటులు ఉన్నారు. సినిమా నటులతో ఓట్లు రాలకపోయినా వారితో పార్టీలకు ఎంతో కొంత జనసమీకరణ జరుగుతుందని చెప్పవచ్చు. అందుకే సినిమా నటులను పార్టీల్లో చేర్చుకోవడానికి నేతలు ఆసక్తిచూపుతారు.
గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. ఆ మధ్య జనసేనలో చేరిన విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆయన మెయిన్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన ఓ రీల్ తెగ వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ ను విమర్శించాల్సి వస్తే.. మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోయారు అని అంటారు.. అంతకంటే ఆయనపై విమర్శించేది ఇంకా ఏముంది మీ బతుకులకు అంటూ విరుచుకపడ్డారు. ఏపీలో వార్ వన్ సైడ్, ఎటు తిరిగి వార్ డిసైడ్ అయిపోయింది. యుద్ధం మేం చేయనక్కర్లేదు.. యుద్ధం రెడీగా ఉంది ఓట్ల రూపంలో అంటూ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఓట్లు గుద్దుడే గుద్దుడు.. రాసుకో ఈ రోజుకో చెబుతున్నా.. 136 సీట్లు గెలుస్తాం..21 పార్లమెంట్ సీట్లు మావే.. ఇది పృథ్వీరాజ్ సర్వే. నీవు ఎన్నిసార్లు సర్వేలు చేయించినా ఫలితం ఇదే. 136 సీట్లలో ఓ నాలుగు అటు ఇటు అవుతాయేమో గాని.. ఇదే ఫలితం రిపీట్ అవుతుంది. వార్ వన్ సైడే అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు. పేటీఎం బ్యాచ్, మీరు ఎన్నీ వాగినా.. ఎన్ని చెప్పినా అదే ఫలితం వస్తుంది.. అందరూ అసహ్యించుకున్నా మీకు బుద్ధి రావడం లేదు. మీరు సోషల్ మీడియాలో ఎన్ని వాగినా ఎవరూ పట్టించుకోరు.. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి.. జై జనసేన అంటూ రీల్ రిలీజ్ చేయడం. ఇక దీంతో పృథ్వీరాజ్ పై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడడం పరిపాటే కదా.
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అన్న మాస్ వార్నింగ్ వార్ వన్ సైడ్ రా పిల్ల జగన్ రెడ్డి….!!🔥🔥🔥🥵🥵🥵🤙🤙🤙@PawanKalyan || @JanaSenaParty#HelloAP_ByeByeYCP#VarahiVijayaYatra pic.twitter.com/eSuVrEo2f4
— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) March 4, 2024