Virat and Rohit Bowling : వాహ్వా విరాట్.. రోహిత్.. బౌలింగ్ లోనూ దుమ్ములేపారుగా..?

Virat and Rohit Bowling

Virat and Rohit Bowling in World Cup 2023

Virat and Rohit Bowling : టీమిండియా సమష్టిగా రాణిస్తున్నది. వరల్డ్ కప్ లో తొమ్మిది వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. ఇక లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ను ఆదివారం ముగించింది. ఈ నెల 15న న్యూజిలాండ్ లో టీమిండియా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది.

ఇక ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ జట్టుపై టీమిండియా 160 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకి 410 పరుగులు చేసింది. ఇందులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేశారు. ఇక శుభ్ మన్ గిల్, రోహిత్, కోహ్లీ అర్ధసెంచరీలు చేశారు.  411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్  జట్టుకి మొదట్లోనే భారీ షాక్ తగిలింది. ఇండియన్ బౌలర్ల ధాటికి ఎదుర్కోలేక నెదర్లాండ్ ఆటగాళ్లు చతికిలపడ్డారు.

అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొత్త అవతారమెత్తారు. ఇద్దరు కూడా బౌలింగ్ చేశారు. అల్ రౌండర్ షో చేసి జట్టును విజయం వైపు నడిపించారు. ఇక కోహ్లీ మీడియం పేస్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక నెదర్లాండ్ కెప్టెన్ అయిన ఎడ్వర్డ్ ను కోహ్లీ అవుట్ చేశాడు. వికెట్ కీపర్ రాహుల్ ఈ క్యాచ్ ను పట్టగా, ఎడ్వర్డ్ అవుట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ తో పాుట రోహిత్ శర్మ కూడా బౌలింగ్ చేశాడు.

నెదర్లాండ్స్ బ్యాట్స్ మన్ తేజ నిదమునురు ను అవుట్ చేశారు. అర్ధ సెంచరీతో చెలరేగి ఆడుతున్న ఈ బ్యాట్స్ మెన్ రోహిత్ బౌలింగ్ లో షాట్ ఆడబోయి షమీకి చిక్కాడు.  ఇక రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేస్తుండగా స్టేడియం అంతా వీరిద్దరి నామస్మరణతో మార్మోగింది. ఇక కోహ్లీ 3 ఓవర్లు వేసి 13పరుగులు ఇచ్చాడు. మరోవైపు రోహిత్ శర్మ 5 బంతులు వేసి 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు.

TAGS