Viral News : వావ్ ఇలాంటి ఛాన్స్ దొరికితే బాగుండు.. అక్కడ జాబ్ చేస్తే ప్రభుత్వమే ఎదురు డబ్బులు ఇస్తుందట
Viral News : సాధారణంగా మనం ఏదైనా ప్లేస్ కు వెళ్లినప్పుడు ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ బతకాలంటే ప్రస్తుతం మనం ఖర్చు పెట్టేకంటే కూడా ఎక్కువ డబ్బులు కావాలి. అవి కావాలంటే ఉద్యోగం కావాలి. అలాంటి పరిస్థితిలో ఎవరైనా మీకు మంచి ప్రదేశంలో ఉన్నందుకు ప్రతిఫలంగా డబ్బు ఇస్తే ఎంత బాగుంటుంది. ఒక్క సారి ఊహించుకోండి.. అటువంటి దేశాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతాల్లో స్థిరపడడానికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది.
మీరు వ్యాపార ఆలోచనతో మారిషస్‌కు వెళితే అక్కడ నివసించడానికి.. పని చేయడానికి, వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం 20 వేల మారిషస్ రూపాయలు అంటే మన కరెన్సీలో రూ. 36,759 ఇస్తుంది. ఇటలీలో కూడా చాలా నగరాలు ఉన్నాయి. అక్కడ స్థిరపడడానికి మీకు మంచి ఆఫర్లు లభిస్తాయి.Candela, Molise,Vetto అలాంటి చోట్ల స్థిరపడేందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక్క యూరోకే ఇళ్లు కొనుక్కోవచ్చు. Invest Your Talent ప్లాన్ కింద, రూ. 8 లక్షల కంటే ఎక్కువ ($10,000) , ఏడాది కాలపు వీసా లభిస్తుంది.
స్పెయిన్‌లోని పొంగాలో జీవించేందుకు ప్రభుత్వం డబ్బును అందిస్తుంది. ఎవరైనా కనీసం ఐదేళ్ల పాటు ఉండాలనే ప్రణాళికతో వస్తున్నట్లయితే 3000 యూరోలు అంటే రూ. 2,68,425 ప్రభుత్వం ఆర్ధికసాయం ఇస్తుంది. న్యూజిలాండ్ కూడా Kaitangta పేరున్న చిన్న పట్టణంలో స్థిరపడేందుకు ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. వారి జనాభాను పెంచాలి, అందుకు వారు 165000 అమెరికా డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఒక కోటి భూమి, గృహ ప్యాకేజీని ఇస్తారు. స్విట్జర్లాండ్ కూడా Albinen అనే చిన్న గ్రామంలో నివసించడానికి డబ్బును ఆఫర్ చేస్తోంది. 45 ఏళ్లలోపు వారు ఇక్కడ స్థిరపడేందుకు వస్తే25000 అమెరికాన్ డాలర్ కంటే ఎక్కువ ఇస్తుంది అంటే 20. 80లక్షలు. ఇక్కడే ఉండి బిడ్డకు జన్మనిస్తే ఒక్కో బిడ్డకు రూ.8.35లక్షలు అందజేస్తారు. ఐర్లాండ్ ప్రభుత్వం సహాయం కూడా అందిస్తుంది. ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసే వారికి లక్షల రూపాయలు నిధులు ఇవ్వడంతోపాటు ట్యాక్స్ క్రెడిట్ కూడా పొందుతున్నారు. మీ ఆలోచన ప్రభుత్వానికి నచ్చాలనేది ఒక్కటే షరతు.