income : వావ్ గ్రేట్.. కోట్ల ఆదాయాన్ని కాలితో తన్నేశాడు

income

VLC Media Plyer income

income : భారతదేశం అత్యధిక సంఖ్యలో వీఎల్సీ మీడియా ప్లేయర్ వినియోగదారులను కలిగి ఉంది. దానిలో ఇప్పటి వరకు ఎటువండి ప్రకటనలు లేకుండా వినియోగదారులు నాణ్యమైన సేవలను అందిస్తోంది. ఇదంతా దాని సృష్టికర్త జీన్-బాప్టిస్ట్ కెంప్ఫ్ గొప్పతనమనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సాఫ్ట్ వేర్ ను నడిపిస్తున్నారు. తాజాగా జీన్-బాప్టిస్ట్ కెంప్ఫ్ వీఎల్సీ ప్లేయర్‌ను యాడ్-ఫ్రీగా ఉంచడానికి ఓ కంపెనీ లాభదాయకమైన ఆఫర్‌ ను అందించింది. కానీ అతడు దానిని తిరస్కరించారు. వీఎల్సీని ఉచిత, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌గా నిర్వహించడంలో అతని నిబద్ధత దాని విజయానికి ప్రధాన కారకంగా ఉంది. తన ప్లేయర్ వినియోగదారులు ఆటంకాలు లేకుండా సేవలను ఆనందించాలని అతడు కోట్లు రూపాయలను కూడా కాలదన్నుకున్నాడు.

ఆ మధ్య మన దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ వీఎల్సీ మీడియా ప్లేయర్ నిషేధించబడింది. నివేదిక ప్రకారం, వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్సీ మీడియా ప్లేయర్, వెబ్‌సైట్‌ను ఐటీ చట్టం, 2000 కింద ప్రభుత్వం నిషేధించింది. వీఎల్సీ మీడియా ప్లేయర్, దాని వెబ్‌సైట్ సేవలు ఇప్పటికే రెండు నెలల పాటు నిలిపివేయబడ్డాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. VLC మీడియా వెబ్‌సైట్‌ను తెరవగానే, IT చట్టం కింద నిషేధించబడినట్లు సందేశం కనిపించింది.

TAGS