
IPL 2025
IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముకేశ్ కుమార్ IPL చరిత్రలో ఒక అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కనీసం 300 బంతులు వేసిన బౌలర్లలో అత్యంత చెత్త ఎకానమీ రేటు కలిగిన బౌలర్‌గా ఆయన నిలిచారు. ముకేశ్ కుమార్ ఎకానమీ రేటు 10.45గా ఉంది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన 2 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు. ఇప్పటివరకు 21 IPL మ్యాచ్‌లు ఆడిన ముకేశ్ 10.45 ఎకానమీతో 25 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ జట్టు ముకేశ్ కుమార్ కోసం ఏకంగా రూ. 8 కోట్లు వెచ్చించడం గమనార్హం.