smallest chess player : మూడేళ్ల పిల్లలు ఏం చేస్తారు..? టీవీలో కార్టూన్లు చూడడం, లేదంటే చిన్న చిన్న బొమ్మలతో ఆడుకోవడం.., మారం చేయడం చేస్తుంటారు. కానీ ఇక్కడో బుడ్డోడు చెస్ ఆడుతున్నాడు. చెస్ ఆటతీరును కూడా అర్థం చేసుకునే ఏజ్ కూడా కాదు. అయినా బుడతడు చెస్ లో రఫ్ఫాడించేస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన అనిష్ సర్కార్ చెస్ బోర్డుపై ర్యాక్ చేస్తున్నాడు. కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అనీష్ కు కేవలం మూడు సంవత్సరాల ఎనిమిది నెలల 19 రోజులు మాత్రమే. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. భారతదేశం ఇప్పటి వరకు చూసిన అత్యంత అసాధారణమైన ప్రతిభావంతుల్లో ఈయన ఒకరు. అనీష్ జనవరి 26, 2021న ఉత్తర కోల్‌కతాలో జన్మించాడు. అక్టోబరులో పశ్చిమ బెంగాల్ స్టేట్ అండర్-9 ఓపెన్ టోర్నమెంట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ పోటీలో ఇద్దరు FIDE-రేటెడ్ ఆటగాళ్లను ఓడించాడు. నవంబర్ 1, 2024న, అనిష్ అధికారికంగా 1555 FIDE రేటింగ్‌ను సాధించాడు, FIDE-రేటింగ్ పొందిన అతి పిన్న వయస్కుడిగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.