Venkatesh watched India-New Zealand : సినిమా తారలకు క్రికెటర్లకు అభిమానులుంటారు. సినిమా తారలు కూడా క్రికెటంటే ఇష్టపడతారు. ప్రముఖ తెలుగు కథానాయకుడు విక్టరీ వెంకటేష్ కు క్రికెటంటే పిచ్చి. ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆయన హాజరవుతూ ఉంటాడు. క్రికెట్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగని ఊరుకోడు. తాను కూడా ఓ మంచి ఆటగాడే. దీంతో క్రికెట్ మ్యాచ్ ఎప్పుడున్నా వచ్చి క్రికెటర్లను ఉత్సాహపరచడం ఆయనకు ఓ అలవాటు.
ముంబయి వేదికగా భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా అదరగొడుతోంది. దీంతో వెంకటేష్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు. వెంకటేష్ ఎప్పుడు మ్యాచ్ చూడటానికి వచ్చినా భారత్ గెలిచి తీరుతుందని చెబుతున్నారు. వి అంటే విరాట్ కోహ్లి, వెంకటేష్ అంటూ కామెంటర్లు చెప్పడంతో వెంకీ సంతోషంతో పొంగిపోయారు.
ఈ మ్యాచ్ లో సచిన్ టెండుల్కర్, వెంకటేష్ తో పాటు మహామహుల ముందు విరాట్ కోహ్లి చేసిన సెంచరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లి దాటేశాడు. దీంతో అందరికి అభివాదం చేశాడు. మొత్తానికి మ్యాచ్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది.
లెజెండ్ క్రికెటర్ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివిఎస్ రిచర్డ్స్ తో కలిసి సరదాగా మ్యాచ్ వీక్షించాడు. అతడితో సరదాగా మాట్లాడాడు. మ్యాచ్ కు ప్రత్యేక ఆకర్షణగా మిగిలాడు. కామెంటర్లతో వెంకటేష్ తన అనుభవాలు పంచుకున్నాడు. పలు విధాలుగా మన వారు ఎంత స్కోరు చేస్తారనేదానిపై జోస్యం చెప్పాడు. చివరి రెండు బంతుల్లో రెండు ఫోర్లు వస్తాయని చెప్పడంతో కచ్చితంగా అలాగే వచ్చాయి. అలా వెంకటేష్ ఆటలో ఆకట్టుకునేలా మాట్లాడి అందరి మనసులు గెలుచుకున్నాడు.