Team India Final Against Australia : వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్ కు ఆ బ్యాటర్ ఔట్.. ఆా ప్లేయర్ కు చోటు
Team India Final Against Australia : వరల్డ్ కప్ ఫైనల్ రేపు గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు బరిలో నిలిచాయి. దీంతో ఏ జట్టు విజయం సాధిస్తుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అన్ని విభాగాల్లో భారతే ఫేవరేట్ అయినా గెలిచేదాకా అందరికి ఆసక్తి ఉంటుంది. సెమీ ఫైనల్ భారత్ న్యూజిలాండ్ ను ఆస్ల్రేలియా దక్షిణాఫ్రికాను చిత్తు చేశాయి. దీంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి.
టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరింది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, విరాట్, గిల్, రాహుల్, శ్రేయస్ లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ లు రాణిస్తున్నారు. దీంతో భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటర్లను భయపెట్టడంలో మన బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. భారత్ ను ఎదుర్కోవడం అంత సులభం కాదనే వాదనలు వస్తున్నాయి.
రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో మాయ చేస్తున్నారు. ఫీల్డింగ్ లోనూ మెరిపిస్తున్నారు. స్టేడియంలో పాదరసంలా కదులుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉన్నా ఒక లోటు మాత్రం వెంటాడుతుంది. ఈ వరల్డ్ కప్ లో అందరు రాణిస్తున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన ఆటతీరు ప్రదర్శించడం లేదు. ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యాన్ని మార్చుకోవడం లేదు.
ఈ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ 89 పరుగులే చేశాడు. 15 సగటున యావరేజ్ నమోదు చేశాడు. జట్టుకు భారంగా మారాడు. ఫైనల్ లో ఇతడిని తప్పించే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకొచ్చే సూచనలున్నాయి. సూర్య స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకునేందుకు జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయించుకుందని సమాచారం.