JAISW News Telugu

Cricket World Cup Finals : వరల్డ్ కప్ ఫైనల్.. ఈ సారి వార్ వన్ సైడేనా..?

Cricket World Cup Finals

Cricket World Cup Finals

Cricket World Cup Finals : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 తుది సమరం ఆదివారం జరగబోతున్నది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కు అతిథ్య దేశం భారత్ భారీ ఏర్పాట్లు చేసింది. 9 సూర్య కిరణ్ విమానాలతో ఎయిర్ షో కూడా క్రీడాభిమానుల కోసం నిర్వహించబోతున్నది. ఇక మ్యూజిక్ , లేజర్, డ్రోన్, క్రాకర్స్ షో అదనపు అనుభూతిని ఇవ్వబోతున్నది.

అయితే ఈ మ్యాచ్ లో వార్ వన్ సైడేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సొంతగడ్డపై, తన అభిమానుల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుండడం రోహిత్ సేనకు అదనపు ప్రయోజనం. అయితే రెండు జట్ల పరంగా చూసుకున్నా ఇదే అభిప్రాయం వినిపిస్తున్నది. రెండు జట్లలో ఆటగాళ్లను చూసుకుంటే, టీమిండియాలోనే ఫామ్ లో ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన విశ్లేషణ ఇప్పడు అందరి దృష్టిలో పడింది.

ఇక భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఆసీస్ ఓపెనర్ హెడ్ తో పోలిస్తే ఇద్దరూ సమానమే. ఇప్పుడు గిల్ మంచి ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వస్తున్నది. ఇక ఈ వరల్డ్ కప్ లో అందరికంటే ఎక్కువగా చెలరేగి ఆడుతున్నాడు కోహ్లీ, ఆస్ర్టేలియాలో ఇలా ఆడే మార్ష్ తో పోల్చుకున్నా మన విరాట్ దే పైచేయి.  ఈ వరల్డ్ కప్ లో 10 ఇన్నింగ్స్ లు ఆడి 711 పరుగులు చేశాడు కోహ్లీ. ఆఖరి మ్యాచ్ లో నే తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక షమీని కమిన్స్ తో పోల్చినా మనమే బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇలా అందర్నీ పోల్చగా ఇండియాకు 6, ఆస్ర్టేలియా 1 పాయింట్ సాధించాయి. నాలుగు పోలికల్లో మాత్రమే రెండు జట్లు సమానంగా ఉన్నాయి.

Exit mobile version