World Cup 2023 Second Semi Final : సెమీ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డు..
World Cup 2023 Second Semi Final : క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రోజు (నవంబర్ 16) సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యా్చ్ కొనసాగుతుంది. రెండు జట్లు ఫైనల్ కు చేరుకునేందుకు హోరా హోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిసి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాను పాట్రిక్ జేమ్స్ కమిన్స్ సేన ఆదిలోనే చుక్కలు చూపిస్తోంది. టెంబా బావుమా (సౌత్ ఆఫ్రికా) సేన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొనలేకపోతోంది.
ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డును నమోదు చేసింది. పవర్ ప్లే (1వ ఓవర్ నుంచి 10వ ఓవర్ వరకు) లో 60 బంతులకు గానూ సౌతాఫ్రికా కేవలం 2 వికెట్లను సమర్పించుకొని 18 పరుగులు మాత్రమే చేసింది. ఇది నిజంగా అతి చెత్త రికార్డనే చెప్పవచ్చు. ఇక ఇదే వరల్డ్ కప్ లో శ్రీలంక 14/6 (భారత్ తో), 2015లో పాకిస్తాన్ 14/2 (జింబాబ్వే), 2011లో కెనెడా 14/3 (జింబాబ్వే), 2011 లో విండీస్ 18/3 (పాకిస్తాన్)తో స్కోర్లు నమోదు చేశారు.
వాతావరణ పరిస్థితుల (చినుకులు కురుస్తుండడం) నేపథ్యంలో కొంత సేపు మ్యాచ్ కు బ్రేక్ ఎదురైంది. తిరిగి 3.55 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుందని ప్రకటించారు. దీంతో ప్లేయర్లు మరోసారి గ్రౌండ్ లోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఆస్ట్రేలియానే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే 19వ తేదీ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియ ఉంటుంది కావచ్చని క్రీడాకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.