World Cup 2023 First Semis : భారత్‌లో అంతా టెన్షన్.. టెన్షన్.. ఎందుకంటే?
World Cup 2023 First Semis Today India VS Newzeland : ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రోజు భారత్ కీలక మ్యాచ్ ను ఎదుర్కొనబోతోంది. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్ లో రికార్డు విన్నింగ్ నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో అత్యంత వేగంగా నెం. 1 ప్లేస్ లోకి వెళ్లింది. ఇప్పడు సెమీ ఫైనల్ మ్యాచ్ లలో టఫ్ జట్లతో భారత్ తలపడనుంది. ఇందులో భాగంగా ఈ రోజు (నవంబర్ 15) ముంబైలోని వాంకడే స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ తో తలపడనుంది.
గతంలో లీక్ దశలో భారత్-న్యూజిల్యాండ్ ధర్మశాలలో హోరాహోరీగా తలపడగా ఇందులో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్ ను అంత తక్కువగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ తలపడిన వాటిలో చూసుకుంటే ఇద్దరు సమాన విజయం (భారత్ కొంచెం ఎక్కువగా) సాధించారు. ఈ విషయాన్ని టీమిండియా దృష్టిలో ఉంచుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
అయితే లీగ్ లో ఓటమి చవి చూసిన న్యూజిలాండ్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికీ విజయ పరంపర మోగిస్తున్న టీమిండియా కూడా మరో విజయం కోసం తహతహలాడుతోంది. గత వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తోనే సెమీఫైనల్ ఆడిన భారత్ ఓటమిపాలై ఇంటి దారి పట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు టెస్ట్ ఛాంపియన్ షిప్ లో న్యూజిలాండ్ ను భారత్ ఓడించి పగ తీర్చుకుంది. ఇక, ఇరు జట్ల ఫామ్ ను పరిగణలోకి తీసుకుంటే భారత్ ఆడిన ప్రతీ మ్యాచ్ గెలువగా.. న్యూజిలాండ్ నాలుగు పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్: హెడ్-టు-హెడ్
భారత్-న్యూజిలాండ్ 117 సార్లు తలపడగా, అందులో భారత్ 59 సార్లు విజయం సాధించగా, న్యూజిలాండ్ 50 సార్లు మాత్రమే విజయం సాధించింది. 7 మ్యాచ్‌ల ఫలితం లేలకపోగా, ఒకటి టైగా ముగిసింది. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ 2-1తో విజయం సాధించింది.
ప్రపంచ కప్‌లలో..
రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌లలో 10 సార్లు తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ 5 సార్లు విజయం సాధించగా భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, న్యూజిలాండ్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.