World Cup 2023 Final Match Chief Guest : వరల్డ్ కప్ లో భాగంగా జరిగే ఫైనల్ మ్యాచ్ ఈనెల 19న అహ్మదాబాద్ లో జరగనుంది. దీనికి మన ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ప్రముఖ క్రికెటర్లు, కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు మ్యాచ్ ను చూసేందుకు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ ఫైనల్ చేరుకోవడంతో ఇవాళ జరిగే సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో ఏది గెలిస్తే అది ఫైనల్ చేరుకుంటుంది.
భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో విజయం సాధించి ముందు వరసలో నిలిచింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను మట్టి కరిపించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ స్టేడియానికి 1.32 లక్షల మంది కూర్చుండే సామర్థ్యం కలిగింది కావడంతో చాలా మంది ప్రేక్షకులు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖుల రాకతో స్టేడియం సందడిగా మారనుంది.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రీడామైదానంగా పేరు గాంచిన స్టేడియంలో భారత్ తన లక్ ను పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఆడిన మ్యాచుల్లో విజయం సాధించి అందరి మనసులు గెలుచుకుంది. ఇక ఫైనల్ గెలవడమే మిగిలి ఉంది. సగటు ప్రేక్షకుడు కోరుకునేది ఒక్కటే భారత్ ఈ సారి ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నాడు.
భారత్ ఫైనల్ రావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రెండు ప్రపంచ కప్ లు సాధించిన ఇండియాకు ఇది మూడోది కావాలని ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో భారత్ ఫైనల్ లో గెలిచి కప్ ను బహుమతిగా ఇవ్వాలని ప్రతి ఒక్కరి మదిలో ఆశలు కలుగుతున్నాయి. ఇక క్రికెటర్ల వంతు మిగిలింది. ఫైనల్ ను గెలిచి ప్రజలకు గిఫ్ట్ గా కప్ అందించాలని చూస్తున్నారు.