World Champions of Legends : టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళుతుంది. అక్కడ అయిదు టీ 20 ల సిరీస్ ఆడనుంది. అందులో యువ జట్టు పాల్గొననుంది. అయితే జూన్ 3 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు ఇంగ్లండ్ లో వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2024 మ్యాచులు జరగనున్నాయి. ఇందులో భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి జట్లు పాల్గొననున్నాయి. ఇందులో ఆయా దేశాల నుంచి రిటైర్డ్ అయిన చాంపియన్స్ క్రికెటర్లు పాల్గొననున్నారు.
ఇండియా నుంచి యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్బజన్ సింగ్, ఇర్పాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, లాంటి ప్లేయర్లు తిరిగి మైదానంలోకి దిగనున్నారు. ఇండియా ఈ రోజు ఇంగ్లండ్ తో మ్యాచ్ ఆడనుండగా.. జూన్ 5 వ తేదీన వెస్టిండీస్ తో, ఆరో తేదీ పాకిస్థాన్ తో, 8వ తేదీ ఆసీస్ తో, 10 తేదీ సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచులు స్టార్ స్పోర్ట్ 1 లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
ఈ టోర్నమెంట్ కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి అనుమతి రాగా.. ఇంగ్లండ్ జట్టుకు కెవిన్ పీటర్సన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించిన ఇండియా జెర్సీలను సురేశ్ రైనా, ఆర్పీ సింగ్, రాహుల్ శర్మ లు జట్టు జెర్సీల ఆవిష్కరించారు.
ఇంగ్లండ్ లో నాట్ వెస్ట్ సిరీస్ గెలిచిన క్షణాలు ఇంకా నా మదిలో నుంచి చెరిగిపోలేను. ఇంగ్లండ్ అంటేనే ప్రత్యేక అనుబంధం ఉంటుందని ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ నుంచి షాహిద్ ఆఫ్రిది, దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కలిస్, ఇండియా నుంచి సురేశ్ రైనా, ఆస్ట్రేలియా నుంచి బ్రెట్ లీ లాంటి స్టార్ ప్లేయర్లతో పాటు, వెస్టిండీస్ ది బాస్ క్రిస్ గేల్ కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నాడు.