JAISW News Telugu

Google Lumiere : మాటలు చెప్తే చాలు.. వీడియో ఇస్తుంది.. అదే ‘లుమినార్’ ప్రత్యేకత..

Words are enough Video will be given by 'Lumiere'

Words are enough Video will be given by ‘Lumiere’

Google Lumiere : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో సరికొత్త ఆవిష్కరణను ప్రజల ముందుకు తెచ్చినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. దీనికి సంబందించిన విషయాలను ఆయన ఇటీవల డెమో ద్వారా వెల్లడించారు. ఇది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)కి అడ్వాన్స్ వెర్షన్ అని చెప్పారు. దీంతో సులువుగా వీడియో క్రియేట్‌ చేయచ్చని పేర్కొన్నారు. టెక్ట్స్ లు వీడియో,  ఇమేజ్‌ టు వీడియో, వీడియో ఇన్‌ పెయింటింగ్‌ లాంటి కొత్త ఫీచర్లును ఇందులో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియో గూగుల్  తన ఏఐ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫారమైన ‘ఎక్స్ (ట్విటర్)’ లో పోస్ట్‌ చేసింది. స్పేస్-టైమ్ U నెట్ ఆర్కిటెక్చర్‌తో ‘లుమియర్’ ఏఐ పనిచేస్తుందని ఆయన తెలిపారు. వీడియో రూపొందించడాన్ని ఇది సులభతరం చేస్తుందన్నారు.  మీరు రూపొందించాలనుకున్న అంశానికి సంబంధించిన టెక్ట్స్‌ అందిస్తే చాలు ఈ ఏఐ వీడియోను క్రియేట్‌ చేస్తుంది. ఉదాహరణకు.. ‘చిన్న పిల్లవాడు పొలాల మధ్య పరిగెత్తున్నాడు’ అని టెక్ట్ ఇస్తే చేస్తే చాలు అలాంటి వీడియోను వేగంగా రెడీ మనకు ఇస్తుంది.

ఏ ఫొటోతోనైనా వీడియో రూపొందించేందుకు సాయపడుతుంది. వీడియో స్టైలైజేషన్, సినిమా గ్రాఫ్స్‌, వీడియో పెయింటింగ్‌తో పాటు అనేక టూల్స్‌ ఇందులో ఉన్నాయి. ఇది టెక్ రంగంలో విప్లవం సృష్టిస్తుందని చాలా మంది టెక్ దిగ్గజాలు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం చిన్న చిన్న వీడియోలు మాత్రమే క్రియేట్ చేసే లుమినార్ రాను రాను కొంచెం నిడివి పెంచే వీడియోలను చేసేలా డిజైన్ ను మారుస్తామని చెప్పారు. ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version