Women fighting : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తొలిరోజు నుంచే బస్సులు మహిళలతో కిక్కిరిసిపోయాయి. దీంతో.. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీఎస్ ఆర్టీసీకి వందశాతం ఆక్యుపెన్సీ రానుంది. రెస్పాన్స్ వచ్చినంతలా సమస్యలూ వస్తున్నాయి. ఉచిత ప్రయాణం వల్ల మహిళలంతా బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దాదాపు అన్ని బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కూర్చోవడానికి సీట్లు లేని పరిస్థితి ఉండడంతో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సీటు కోసం మహిళలు కొట్టుకున్నారు. దీంతో బస్సులో ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి నుంచి ముప్పారం గ్రామానికి వస్తున్న నితీషా అనే మహిళపై సీటు కోసం మరో ముగ్గురు మహిళలు దాడి చేశారు. ఈ దాడిలో తన బంగారు పుస్తెలు అపహరించారంటూ నితీష ఆరోపించింది. దీంతో పోలీసులకు బస్సు కండక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.