Gangavva : గంగవ్వకు ‘మహిళా సాధికారత అవార్డు’.. ఇదీ గ్రామీణ మహిళ సత్తా..

Gangavva

Gangavva

Gangavva : ‘మై విలేజ్ షో’ గంగవ్వ అంటే తెలియని తెలుగు ప్రజలు ఉండరు. 60 ఏండ్ల వయసులో గంగవ్వ సోషల్ మీడియా సెలబ్రిటీ కావడం నిజంగా హర్షణీయం. అసలు కెమెరా అంటేనే తెలియని ఓ పల్లెటూరి వృద్ధురాలు యూట్యూబ్  ద్వారా ప్రపంచానికి పరిచయం కావడం, ఆమె నటనతో అందరిని అలరించడం విశేషం. యూట్యూబ్ వీడియోలే కాదు ఇతర షోల్లోనూ ఆమె చాన్స్ లు వస్తున్నాయి. ఆమెకు వచ్చిన ఆదరణతో బిగ్ బాస్ లో కూడా అవకాశం వచ్చింది.

ఇక పెద్ద పెద్ద సినిమా నటులు సైతం ప్రమోషన్ కోసం ఆమెతో వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన సాధారణ మహిళ గంగవ్వను జగ్గీ వాసుదేవ్ లాంటి వారు సైతం కలువడం ఆమెకు ఉన్న క్రేజ్ ను తెలియజేస్తోంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలే కాదు పలువురు అగ్ర రాజకీయ నాయకులు సైతం ఆమెతో వీడియోలు చేసి ప్రమోషన్ ఇప్పించుకుంటున్నారు. ఇలా గంగవ్వ సక్సెస్ స్టోరీ ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమే.

గంగవ్వ విజయాలకు ఎన్నో అవార్డులు కూడా క్యూ కట్టాయి. సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న మహిళలకు హైదరాబాద్ బేగంపేటలో ‘‘సేవ్ ది గర్ల్స్ అండ్ ముందడుగు ఫౌండేషన్’’ ఆధ్వర్యంలో ఎంపవర్డ్ విమెన్ అవార్డ్స్-2024 పేరు ఘనంగా సత్కరించారు. నేటి తరపు మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న తెలంగాణకు చెందిన 50 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరిలో గంగవ్వ ఉండడం విశేషం. ఒంటరి మహిళగా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసి తన కాళ్ల మీద నిలబడడమే కాదు సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన గంగవ్వ ప్రతిభను హర్షించని వారు ఉండరు. ఈ అవార్డులు సాధించిన వారిలో గంగవ్వతో పాటు జర్నలిస్ట్ హేమ తదితరులు ఉన్నారు.

TAGS