JAISW News Telugu

Woman Bike Trip : చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పడానికి మహిళ బైక్ యాత్ర

FacebookXLinkedinWhatsapp
Woman Bike Trip

Woman Bike Trip

Woman Bike Trip : విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు తెలుపడానికి మక్బుల్ జాన్ అనే మహిళ బైక్ యాత్ర చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో యాత్ర ప్రారంభించిన ఆమె గురువారం సాయంత్రం గోరంట్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

2020లో ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సుమారు 800 కి.మీ. బైక్ యాత్ర ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. అది పూర్తయ్యాక అప్పటి సీఎం జగన్ ను కలవడానికి వెళితే కనీసం గేటు వద్దకు రానివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

Exit mobile version