JAISW News Telugu

Samantha : విడిపోకుండా ఉంటే నా జీవితం మరో సావిత్రిలా అయ్యేది: సమంత

Samantha

Samantha

Samantha : తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా దాదాపు 20ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోల అందరి సరసన నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకపోవడంతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఆమె చాలా ట్రోలింగ్ కు గురైంది. మయోటైటిస్ బారిన పడి సినిమాలకు దూరమైంది.

త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్రకటించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అప్పుడప్పుడు నాగచైతన్య గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా నిలుస్తుంది. నాగచైతన్య మాత్రం విడిపోయిన తర్వాత ఎక్కడా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమంత గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో అక్కినేని అభిమానులందరూ ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు.

ఒక సందర్భంలో ప్రేమ గురించి సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. తన జీవితం కూడా మరో సావిత్రిలా అయ్యేదని, తృటిలో తప్పించుకున్నానంటూ చెప్పుకొచ్చింది. మొదట్లో సావిత్రి గురించి తనకు పెద్దగా తెలియదని, మహానటి సినిమా చేసే సమయంలోనే ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నానని, సావిత్రిగారిలా తాను కూడా ప్రేమ విషయంలో మోసపోయానని, అదృష్టవశాత్తూ దానినుంచి బయటపడ్డానని, లేదంటే తన జీవితం కూడా సావిత్రిలానే అయ్యేదని చెప్పింది.

గతంలో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సిద్ధార్థ గురించే అని కొందరు నెటిజన్లు అంటుంటే.. కాదు… కాదు నాగచైతన్య గురించి అని మరికొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోపాటు తర్వాత విడాకులు తీసుకుంది. ప్రేమకు సంబంధించి సమంత చెప్పింది కాబట్టి ఆ మాటలు సిద్ధార్థ్ గురించే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version